పుట్టినరోజు : November 07, 1981, మొదిటి సినిమా : సూపర్, రీసెంట్ రిలీజ్ : బాహుబలి 2,

అనుష్క శెట్టి  తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కధానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్ గర్ల్ గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి[ఆధారం కోరబడినది] అనుష్క ఫెవికాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకుంది.
మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల మరియు కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తుళు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు ఇటీవల భూమికా చావ్లాను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్.సినీ నటుడు నాగార్జున ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.అనుష్క మొదటీ సినిమాతొనె తనలొని నటీని ఆవిష్కరింఛింది

News about అనుష్క శెట్టి
2 నిముషాల నిడివి ఉన్న బల్లాల దేవ పట్టాభిషేఖం సీన్ ముఖ్యంగా ఎక్కువ మందికి షేర్ అయినట్టుగా సమాచారం
ఇంకొక నాలుగు రోజుల్లో బాహుబలి(ది కంక్లూజన్) ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శకుడు రాజమౌళి అద్భుతసృష్టి 'బాహుబలి 2' మనముందుకు రావడానికి ఇంకొన్నిరోజులు సమయం మాత్రమే వుంది.
తెలుగు సినీపరిశ్రమలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి సినిమా.
రాజమౌళి అద్భుత సృష్టి 'బాహుబలి(ది కంక్లూజన్) సినిమా షూటింగ్ పూర్తయ్యి రిలీజ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయం అందరికి తెలిసిందే
భారీ బడ్జెట్ తో, భారీ ఎక్సపెక్టషన్స్ తో తెరకెక్కిన రాజమౌళి 'బాహుబలి 2' రిలీజ్ కి రెడీ అవుతుంది.
పోలీసు నేపధ్యంలో తెరకెక్కి వరుసగా సంచలనాలు సృష్టిస్తున్న యముడు
దర్శకుడు హరి తెరకెక్కించిన 'సింగం' సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
అక్కినేని నాగార్జున.. హాథీరామ్‌ బావాజీగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రం విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, వేంకటేశ్వరస్వామి భక్తుల్ని విశేషంగా అలరిస్తూ విజయపథంలో దూసుకెళ్తోంది.
అక్కినేని నాగార్జున ` దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.
 
Recommended
Recommended
Latest News
Latest Albums