పుట్టినరోజు : August 22, 1955, మొదిటి సినిమా : మనవూరి పాండవులు, రీసెంట్ రిలీజ్ : జువ్వ, త్వరలో రాబోయే సినిమాలు : సైరా (నరసింహా రెడ్డి ), యాత్ర , అబిమానులు పిలుచుకునే పేరు : మెగాస్టార్

ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు.చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు,సుస్మిత,స్రిజ ఒక కుమారుడు రాంచరణ్ తేజ.
మెగా స్టార్ గా ప్రాచుర్యం పొందారు , చిరంజీవి రాజకీయనాయకుడిగా మారిన ఒక విజయవంతమైన చలన చిత్ర నటుడు.
అసలు పేరు: శివ శంకర వర ప్రసాద్ కొణిదెల
నిక్ నేమ్స్: చిరు, మెగాస్టార్
చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషకం 1,116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు.

ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలద్రొక్కుకున్నాడు. ఇంకా చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొంది. గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమయిన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, స్వయంకృషి,రుద్రవీణ,ఆపద్భాందవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా చేశాడు.తరువాత కొంతకాలం చిరంజీవి సినిమాలు అంతగా విజయవంతంగా నడవ లేదు.ఠాగూర్, అభిలాష , అడవిదొంగ , చంటబ్బాయి , ఛాలెంజ్, గ్యాంగ్ లీడర్, మాస్టర్, కొండవీటి దొంగ, కొదమ సింహం, ఇంద్ర, వంటి చిత్రాల్లో తన పాత్రలకు చిరంజీవి అన్ని బ్లాక్ బస్టర్స్ నిచ్చారు.
చిరంజీవి సోదరులు నాగేంద్రబాబు (సినిమా నిర్మాత, నటుడు), పవన్ కళ్యాణ్ (మరొక కథానాయకుడు). చిరంజీవి బావ అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కథానాయకునిగా రాణిస్తున్నాడు.తన తండ్రి ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్యగారు .
మళ్ళీ 1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర,ఠాగూర్ సినిమాలు తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. తరువాత వచ్చిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ వంటి సినిమాలు విజయవంతాలైనా గాని సినిమా బడ్జెట్‌లు విపరీతంగా పెరిగి పోవడం వలనా, ప్రేక్షకుల అంచనాలు అతిగా ఉండడం వలనా, రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడం వలనా అంత పెద్ద హిట్‌లుగా పరిగణించబడడం లేదు.

తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా 'బ్రేక్ డ్యాన్స్' చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది. దక్షిణాది హీరోలలొ డాన్స్ చేయడంలొ గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు.
చిరంజీవి అక్టోబర్ 2, 1998లో 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పధాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలనందుకొన్నారని అంచనా . ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలనందుకొన్నాయి
ఇటు తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడం, హిందీలలో కూడా చిరంజీవి ప్రసిధ్ధుడు.
మంజునాథ, సిపాయి చిత్రాలు మొదట కన్నడంలో నిర్మించబడినవి. అక్కడ విజయవంతమయిన పిమ్మట తెలుగులోకి అనువదించబడినవి.
రజినీ కాంత్ కథానాయకుడుగా గీతా ఆర్ట్స్ బ్యానరు పై మాప్పిళ్ళై చిత్రాన్ని నిర్మించాడు. దీనికిఅత్తకి యముడు అమ్మాయికి మొగుడు మాతృక. ఇందులో చిరు అతిథి పాత్రలో కనిపిస్తారు.
గ్యాంగ్ లీడర్ హిందీ పునర్నిర్మాణం ఆజ్ కా గూండారాజ్ లో, అంకుశం హిందీ పునర్నిర్మాణం ప్రతిబంద్ లో, దక్షిణాదిన విజయవంతమయిన జెంటిల్ మేన్ హిందీ పునర్నిర్మాణం ది జెంటిల్ మేన్ లో కూడా కథానాయకుడు గా నటించాడు. ఘరానా మొగుడు మలయాళంలోకి హేయ్ హీరో గా అనువదించబడినది.
పశ్చిమ ఐరోపా ఖండం, ల్యాటిన్ అమెరికా లలో సైతం చిరు పేరొందాడు. దొంగ చిత్రంలో గోలి మార్ పాటకి మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు మరియు జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. అందుకే ఈ దేశాలలో చిరుని ఇండియన్ జాక్సన్ గా వ్యవహరిస్తారు.
కొదమ సింహం చిత్రం ఆగ్లంలొ తీఫ్ ఆఫ్ బాగ్దాద్గా అనువాదం గావించబడి నార్త్ అమెరికా,మెక్సికొ,ఇరాన్ మరియు ఇతర దేశాలలో విజయవంతంగా ప్రదర్శింపబడినది.

చిరంజీవి క్రొత్తగా ప్రజా రాజ్యం అనే పార్టీని స్ఠాపించారు. 2007 వ సంవత్సరం నుండి ప్రసార మాద్యమాల ద్వారా జరుగుతున్న చర్చకు తెరదించుతూ 17 ఆగస్టు 2008 తన రాజకీయ ప్రవేశ విషయాన్ని పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేసారు. 26 ఆగస్టు 2008 న (మదర్ థెరిసా జన్మదినం) తిరుపతి ఆవిలాల చెరువు మైదానం లో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించటం జరిగింది.ఆయన రాజకీయ ప్రవేశంతో చేసే విధి విధానాలు ప్రకటించారు. 2009 సాధారణ ఎన్నికలలో పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ లో 18 సీట్లు గెలుచుకుంది. ఆయన తిరుపతి నుంచి రాష్ట్ర శాసనసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు.పార్టీ ఇటీవల యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కోసం నిలిచి తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రవాద వ్యతిరేకించాడు. ఇందులో, తెలంగాణ న్యాయవాదులు జే ఎ సి రెండు సభ్యులు తెలంగాణ వేరు వ్యతిరేకించినందుకు చిరంజీవి తన పార్టీ యొక్క 12 ఇతర నాయకులు వ్యతిరేకంగా క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
ప్రస్తుతానికి సినిమాలు తీసే ఆలోచనలు ప్రక్కన పెట్టినట్లు ప్రకటించారు. 06 ఫిభ్రవరి 2011 న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు.

News about చిరంజీవి కొణిదెల
మమ్ముట్టి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'యాత్ర', దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. 'ఆనందో బ్రహ్మ' సినిమా ..........
సంక్రాంతికి అజ్ఞాతవాసి, జై సింహ సినిమాలు తర్వాత మళ్లీ అంత దగ్గర్లో పోటీ పడిన పెద్ద హీరో సినిమాలు లేవు, మధ్యలో మహేష్ బాబు నటించిన భరత్ అనే ...... .
ప్రపంచంలో వెలకట్టలేని ప్రేమ తల్లి ప్రేమ, రోజులో మన కోసం మనం ఆలోచించుకునే సమయం కంటే అమ్మ మన గురించి పదింతలు ఎక్కువ ఆలోచిస్తుంది. మనకు అన్నీ తల్లి నుంచే వస్తాయి, మన జననం, మన ఆత్మ అభిమానం, మన.......
సావిత్రి గారిని గుర్తు చేసుకుంటూ, ఒక చక్కటి భావోద్వేగానికి లోనయ్యే చిత్రం 'మహానటి', ఈ సినిమా ను తీసిన నాగ అశ్విన్ కి ప్రశంసల జల్లు కురుస్తోంది. అదే మాదిరి సావిత్రి గారి పాత్రని పోషించిన కీర్తి సురేష్ ఎప్పటికీ ప్రేక్షకుల మనసులో .......
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక స్టార్ మాత్రమే కాదు అంతకు మించి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం స్టార్ అనే పదానికి దూరంగానే వుంటారు, కానీ పవన్ ఏం చేసినా అదోక సంచలనమే, ఇక పూర్తి రాజకీయాల్లోకి......
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”.
నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళంలో నెంబర్ వన్ నటి, తనకున్న ఇమేజ్ తో సగటు హీరోలు సైతం ఈర్ష పడేలా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార....
శ్రీదేవి గురించి ఇలాంటి ఒక సంద‌ర్భం వ‌స్తుంద‌ని అనుకోలేదు. ఆమె గురించి ఇలా మాట్లాడాల్సి వ‌స్తుంద‌ని నిజంగా నేనెప్పుడూ ఊహించ‌లేదు. ఇది దుర‌దృష్టం. అందం అభిన‌యం క‌ల‌బోసిన న‌టి శ్రీదేవి. అత్య‌ద్భుత న‌టి. ఇలాంటి న‌టి.....
వెంకటేష్ - నాగచైతన్య ల కాంబినేషన్లో ఎప్పటినుంచో ఒక సినిమా చేయాలని సురేష్ బాబు ప్రయత్నిస్తున్నాడు. అన్నీ కుదిరితే అందులో రానా కు కూడా ఒక పాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఒకే కుటుంబం నుంచి ఎంత మంది హీరోలు ......
ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి - సురేఖ ల పెళ్లిరోజు. పునాదిరాళ్లు సినిమాతో సినీ అరంగేట్రం చేసిన చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ అనతికాలంలోనే మంచి .
 
Recommended
Recommended
Latest News
Latest Albums