పుట్టినరోజు : June 19, 1985, మొదిటి సినిమా : లక్ష్మీ కల్యాణం (తెలుగు)లో, రీసెంట్ రిలీజ్ : ఎంతవరకు ఈ ప్రేమ,

కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది.

ఈమె 2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన చందమామ సినిమాలో కథానాయికగా నటించింది. ఈమె 2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ చరణ్ తేజ తో రాజమౌలి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. తర్వాత 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది. తర్వాత జూనియర్ ఎంటీయార్ తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది. తరవాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు. 2010లో ఈమె ప్రముఖ తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన నా పేరు శివ చిత్రంలో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2012 లో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ సినిమాలో నటించారు. ప్రస్తుతం సూర్య సరసన మాట్రన్ అనే తమిళ సినిమాలో నటిస్తూంది.

News about కాజల్ అగర్వాల్
గతం లో రెమ్యూనరేషన్ అనేది అవకాశాలు ఉన్నప్పుడు ఒకలా లేనపుడు ఒకలా ఉండటం ఆనవాయితీగా ఉండేది.
స్టార్ హీరోల అందరి సరసన నటించి తెలుగు పరిశ్రమలో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దగ్గుపాటి సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
యామిరుక్క బ‌య‌మేన్‌` ఫేమ్ డీకే దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈనెల 7న (ఏప్రిల్ 7)న రిలీజ‌వుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సమయాన్ని బట్టి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుంది
`రంగం` ఫేం జీవా - కాజల్ అగర్వాల్ జంట‌గా తెర‌కెక్కిన‌ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ `కవలై వేండాం`
'లక్ష్మి కళ్యాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన 'కాజల్ అగర్వాల్ ' చందమామ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపొయింది
ఉంగరాల జుట్టు, పెద్ద పెద్ద కళ్ళతో చూడగానే ఆకట్టుకునే రూపం హీరోయిన్ 'నిత్యా మీనన్' ది.
దాదాపు 10 సంవత్సరాల తరవాత అభిమానుల ముందుకు వస్తున్న 'మెగాస్టార్ చిరంజీవి' కి అభిమానులు పెద్ద ఎత్తునే నీరాజనాలు పడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం `ఖైదీ నంబ‌ర్ 150`.
 
Recommended
Recommended
Latest News
Latest Albums