wallpaper
celebrity
నాగార్జున అక్కినేని
Views : 25788
పుట్టినరోజు : August 29, 1959, మొదిటి సినిమా : విక్రమ్, రీసెంట్ రిలీజ్ : హలో, అబిమానులు పిలుచుకునే పేరు : యువ సామ్రాట్

అక్కినేని నాగార్జున (ఆగష్టు 29, 1959న చెన్నైలో జన్మించిన) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత. ఇతను 1960, 70లలో ప్రఖ్యాత నటుడైన అక్కినేని నాగేశ్వర రావు యొక్క కుమారుడు.
నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాధమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించాడు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. తరువాత మిచిగన్ విశ్వ విద్యాలయంలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉన్నత విద్యను అభ్యసించాడు . ఇతని ప్రధమ వివాహం ఫిబ్రవరి 18, 1984  నాడు లక్ష్మితో  జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్ కు సోదరి . వీరిరువురు విడాకులు తీసుకున్నారు. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడాడు. ఈమె మాజీ దక్షిణ భారత నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ నవంబర్ 23, 1986)  మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ ఏప్రిల్ 8 1994) రెండవ భార్య కొడుకు.
నాగార్జున మొదటి చిత్రం విక్రం, మే 23, 1986లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన మజ్ను సినిమాలో విషాద కధానాయకుడి పాత్ర పోషించాడు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధుడు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలో నటించాడు. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం. మరియు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ, ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కధానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉన్నది. ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టాడు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వములో విడుదలైన నిన్నే పెళ్లాడుతా భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించాడు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచినది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడి గా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడ అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు.

2006లో నాగార్జున తన తాజా చిత్రము శ్రీ రామదాసులో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వము వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి.

1998 ఆవిడా మా ఆవిడే, ఆటో డ్రైవర్ ,చంద్రలేఖ,

1999 సీతారామరాజు ,  రావోయి చందమామ

2000 నువ్వువస్తావని,  నిన్నేప్రేమిస్తా, ఆజాద్

2001 ఎదురులేని,బావ నచ్చాడు

2001 ఆకాశ వీధిలో, స్నేహమంటే ఇదేరా

2002 సంతోషం,  మన్మధుడు,

2003 శివమణి,

2004 నేనున్నాను,  మాస్,

2005సూపర్

2006 స్టైల్, శ్రీరామదాసు,  బాస్,

2007 డాన్,2008 కృష్ణార్జున, కింగ్,

2010 కేడి, 2010 రగడ,2011 గగనం,2011 రాజన్న,2012 లొ ఢమరుకం ,2013 లొ గ్రీకువీరుడు ,సినిమాలు చెసారు.

2014 మనం

తన సొంత పతాకమైన అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన మల్టీస్టారర్ సినిమా మనం. అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన ఈ అరుదైన చిత్రంలో శ్రియా, సమంత కథానాయికలుగా నటించారు.

News about నాగార్జున అక్కినేని
దేశ విదేశాల నుంచి అందుతున్న కోట్లాది విరాళాలు, ఇతర ఆదాయ వివరాలు ఇవ్వకుండా చెప్పలేనన్ని అక్రమాలకు పాల్పడుతున్న ఎన్జీవోలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే...
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ సినిమా హలో లో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. ఆమె ప్రముఖ మలయాళ హిందీ సినిమాల దర్శకుడు ప్రియదర్శన్....
అక్కినేని నాగార్జున రెండవ కుమారుడు అఖిల్ లేటెస్ట్ మూవీ 'హలో' ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా అభిమానులను.......
శివ, అంతం, గోవింద గోవింద" వంటి సెన్సేషనల్ హిట్స్ అనంతరం రాంగోపాల్ వర్మ-అక్కినేని నాగార్జునల.....
ఇట్స్ ఆర్జీవీ స్టయిల్..
Updated on : Nov 20, 2017, 12:36 IST
| Views : 64
మామూలుగా ఎవరైనా ముందు సినిమా మొదలెట్టి కొంత పార్ట్ తీశాకో.. ...
బాలయ్య తెలుగుదేశం ఎమ్మెల్యే అన్న సంగతి తెలిసిందే. ఆయన బావ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. ఇలాంటపుడు తమ సినిమాలకు...
అలాంటి క్రేజీ కాంబినేషన్ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రిపీటవ్వానుంది. రాంగోపాల్ వర్మ ఓ అద్భుతమైన కథ చెప్పాడని...
కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నానిల‌తో త్వ‌ర‌లోనే ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతోంది.
పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం "రాజుగారి గది 2".
ఓంకార్ సినిమాను సరికొత్తగా ట్రీట్ చేసిన విధానం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకొంటుంది
 
Recommended
Recommended
Latest News
Latest Albums