మొదిటి సినిమా : నేరము శిక్ష, రీసెంట్ రిలీజ్ : రాజ్యాధికారం,

నారాయణమూర్తి, (జ. డిసెంబరు 31, 1953) తెలుగు సినిమా నటుడు. ఎర్రసైన్యం, చీమలదండు మొదలైన విప్లవ ప్రధానమైన సినిమాల నిర్మాత, నటుడు, హేతువాది, అవివాహితుడు.
నారాయణమూర్తి, తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించాడు. రౌతులపూడిలో 5వ తరగతి వరకు చదివాడు. రౌతులపూడిలో ఒక సినిమా థియేటర్ ఉండేది. చిన్నతనం నుండి సినిమాలలో ఆసక్తితో ఎన్టీయార్ మరియు నాగేశ్వరరావుల సినిమాలు చూసి, విరామ సమయంలో వారిని అనుకరించేవాడు. అక్కడే తన నటనా జీవితానికి పునాది పడిందని చెప్పుకున్నాడు. శంఖవరంలో ఉన్నత పాఠశాలలో చేరాడు. అక్కడే నారాయణమూర్తికి సామాజిక స్పృహ కలిగింది. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి, విప్లవ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు.
పెద్దాపురంలో బి.ఏ చదవడానికి కాలేజీలో చేరాడు. అక్కడ రాజకీయాలతో ప్రభావితుడై, సినిమాలు, రాజకీయాలు మరియు సమాజిక బాధ్యత అనే మూడు వ్యాసంగాలపై ఇష్టాన్ని ఏర్పరచుకున్నాడు. కళాశాల ఈయన విద్యార్ధి సంఘానికి అధ్యక్షుడిగానే కాకుండా కళాశాల లలిత కళల విభాగానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు. అంతేకాక తను ఉంటున్న ప్రభుత్వ హాస్టలు యొక్క విద్యార్ధి అధ్యక్షునిగానూ, పేద విద్యార్ధుల నిధి సంఘానికి కార్యదర్శి గానూ పనిచేశాడు. స్థానిక రిక్షా కార్మికులు ఈయనను మద్దతుకోసం సంప్రతించేవారు. నారాయణమూర్తి పట్టణ రిక్షాసంఘం అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు. ఎమర్జెన్సీ కాలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందువలన పోలీసులు ఈయన్ను తీసుకునివెళ్ళి ఇంటరాగేట్ కూడా చేశారు. అంతేకాక నారాయణమూర్తి సినిమా నటి మంజులతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయించి నూతన కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణ ప్రారంభించాడు. అప్పట్లో బీహార్లో వరదసహాయానికి తగిన విధంగా తోడ్పాడ్డాడు. సహవిద్యార్ధులు నారాయణమూర్తిని కాలేజీ అన్నగా వ్యవహరించేవారు
నారాయణమూర్తి సినిమాల్లో హీరో కావాలనే జీవితాశయం ఉండేది. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన వెంటనే చెన్నై వెళ్ళి అక్కడ దాసరి నారాయణరావును కలిశాడు. కృష్ణ సినిమా నేరము-శిక్షలో ఈయనకు ఒక చిన్నపాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఒక పాట చిత్రీకరణలో 170 మంది జూనియర్ ఆర్టిస్టులలో ఈయనా ఒకడు. చిన్నవేషంతో నిరుత్సాహపడ్డాడు. కానీ, ఇంటర్మీడియట్ పాసైన విషయం తెలిసింది. డిగ్రీ పూర్తి చేసుకొని తిరిగి రమ్మని దాసరి సలహా ఇచ్చాడు. అదీకాక, సినిమా టైటిల్లలో ఎన్.టి.రామారావు బి.ఏ అని చూసి, తనూ బి.ఏ చెయ్యాలనే కోరిక ఉండేది. అలా బి.ఏ చెయ్యటానికి తూర్పుగోదావరి తిరిగివచ్చాడు. అదే సమయంలో నేరము-శిక్ష సినిమా విడుదలైంది. వందమందిలో ఒకడిగా నిలబడినా, తన గ్రామప్రజలు సినిమా చూసి, తనను అందులో గుర్తిపట్టి, తను కనిపించిన సన్నివేశాలు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి, ఈలలు వేశారు. "మన రెడ్డి బాబులు సినిమాలో ఉన్నాడు" అని చెప్పేవారు. ఈ గుర్తింపు సినిమావంటి ప్రజామాధ్యమం యొక్క శక్తిని నారాయణమూర్తి గుర్తించేలా చేసింది. అప్పుడే డిగ్రీ పూర్తిచేసి సినిమాలలో చేరాలని నిశ్చయించుకున్నాడు.

డిగ్రీ పూర్తయిన తర్వాత తిరిగి దాసరిని కలుసుకున్నాడు. అప్పుడు ఆయన తెలుగుచిత్ర పతాకంపై రమేష్ బాబు హీరోగా నీడ అనే సినిమా తీస్తున్నాడు. సినిమాకు రామినేని సాంబశివరావు మరియు డా.రామకోటేశ్వరరావు నిర్మాతలు. ఆ సినిమాలో నారాయణమూర్తి కొంత ప్రాధాన్యత ఉన్న నక్సలైటు పాత్ర లభించింది. సినిమా బాగా విజయవంతమై, నారాయణమూర్తి మద్రాసులోని చోళ హోటల్లో కరుణానిధి చేతులపై వంద రోజుల షీల్డు అందుకున్నాడు. ఆ తరువాత దాసరి, రామానాయుడు, జ్యోతి శేఖరబాబు వంటి దర్శకుల ప్రోత్సాహంతో అనేక సినిమాలలో సహాయపాత్రలలో నటించాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో నారాయణమూర్తి పూర్తిస్థాయి హీరోగా సంగీత అనే సినిమా తీశాడు. ఈ చిత్రాన్ని పూర్ణాపిక్చర్స్ పతాకంపై హరగోపాల్ నిర్మించాడు. అందులో రెండు పాటలను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడాడు. చిత్రం ఒక మోస్తరు విజయం సాధించి 50 రోజులపాటు ఆడింది. అయితే ఆ తర్వాత హీరోగా అవకాశాలు రాలేదు, చిన్నవేషాలకు కూడా తీసుకోక బాగా కష్టాలను ఎదుర్కొన్నాడు. తిండికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే హీరో అవ్వాలంటే మొదట దర్శకునిగా నిలదొక్కుకోవాలని అనుకున్నాడు.
నారాయణమూర్తి ఏ ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడతాడు. అవివాహితుడైన నారాయణమూర్తిని ఎందుకు పెళ్ళిచేసుకోలేదని ప్రశ్నిస్తే, అదంత చర్చించదగ్గ అంతర్జాతీయ సమస్యేమీకాదని దాటవేశాడు. తన జీవిత భాగస్వామి తన ప్రజాజీవితానికి ఎక్కడ అడ్డువస్తుందో అనే అనుమానంతో పెళ్ళి చేసుకోలేదట. సినీ దర్శకనిర్మాతగా 19 సినిమాలను తీసి, 25 సినిమాలలో నటించి ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ, ఈయనకు సొంత ఇళ్లు కానీ, సొంత కారు కానీ లేవు. ఈయనకు తెలుగుదేశం పార్టీ రెండుసార్లు కాకినాడ లోక్‌సభ స్థానం, కాంగ్రేసు పార్టీ తుని అసెంబ్లీ సీటు ఇవ్వజూపినా, రాజకీయాలలో ప్రవేశించే ఉద్దేశం లేకపోవటం వలన తిరస్కరించాడు.

News about అర్. నారాయణమూర్తి
చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బంద్ అనేది బ్ర‌హ్మాస్ర్తం లాంటిది. అలాంటి బ్ర‌హ్మాస్త్రాన్ని ఉప‌యోగించి తెలుగు ఫిలిం చాంబ‌ర్ వారు ఏం సాధించారో అర్థం కావ‌డంలేదు.
గతం లో ఈ అవార్డును కొమరం భీమ్ చిత్రం నిర్మాత, దర్శకుడు అల్లాణి శ్రీధర్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ లు అందుకున్నారు.
నా చేతుల మీదుగానే అల్లు రామ‌లింగ‌య్య అవార్డును అందించాను.
పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణమూర్తి, స‌హ‌జ న‌టి జ‌య‌సుధ జంట‌గా న‌టించిన చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామయ్య‌`.
పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణమూర్తి, స‌హ‌జ న‌టి జ‌య‌సుధ జంట‌గా న‌టించిన చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామయ్య‌`
ఒక్కో సారి కొన్ని కొన్ని ఊహించ‌ని సంచ‌ల‌నాలు జరుగుతుంటాయి. అరుదైన కాంబినేష‌న్ లో రూపొందుతున్న హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య సినిమాకు కూడా అలాంటిదే జ‌రుగ బోతుందా అంటే నిజ‌మే అని అంటున్నాయి కొన్ని సంఘ‌ట‌న‌లు ..
ఆర్.నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ జంట‌గా తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలోశ్రీమ‌తి చ‌ద‌ల‌వాడి ప‌ద్మావ‌తి నిర్మించిన చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌
పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణమూర్తి, స‌హ‌జ న‌టి జ‌య‌సుధ జంట‌గా న‌టించిన చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామయ్య‌`
హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య సినిమా ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకుని ఎయు స‌ర్టిఫికెట్ పొందింది.
ప్ర‌ముఖ నిర్మాత చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు తొలి సారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య సినిమా వ్యాపార వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న ఈ సినిమా చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా, బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి సినిమాలు విడుద‌ల‌వుతున్న‌ప్ప‌టికీ ఎలాంటి బెరుకు లేకుండా ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్న‌హాలు చేస్తున్నారు..
 
Recommended
Recommended
Latest News
Latest Albums