పుట్టినరోజు : March 21, 1966, మొదిటి సినిమా : మంగళ నాయకి, రీసెంట్ రిలీజ్ : గేమ్,

నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన, విక్రమ్ (నాగార్జున తొలి చిత్రం, హీరో ఆధారంగా తీయబడింది 1985) ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో (అల్లుడుగారు, రౌడీగారు, ఇటీవల గేమ్) మొదలైనవారితో నటించింది. తెలుగుతోపాటు మళయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మళయాళ చిత్రం మణిచిత్రతాజులో అద్భుతంగా నటించి అవార్డు పొందింది.
1980లలో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు. అందంలోను నటనలోనే కాక నాట్యంలో కూడా ఆద్భుతంగా రాణిస్తున్న వ్యక్తి ఈమె. ఆమె చెన్నై లోని చిదంబరం నాట్య అకాడెమీ లో శిక్షణ పొందినది. ఆమె గురువు పేరు చిత్రా విశ్వేశ్వరన్ . భరత నాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో ఆమె దిట్ట. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు.
1994లో ఆమె కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేసింది. ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశం భరతనాట్యంలో శిక్షణ, భారతదేశమంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహించడం.
1994లో విడుదలైన మణిచిత్రతళు అనే మళయాళ సినిమాకు గాను ఆమెకు భారత ప్రభుత్వం నుంచి తొలిసారిగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. తరువాత 2001 వ సంవత్సరంలో ప్రముఖ దక్షిణాది నటి రేవతి దర్శకత్వం వహించిన మిత్ర్ మై ఫ్రెండ్ అనే ఆంగ్ల చిత్రానికి గాను రెండవసారి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.

News about శోభన
1980 - 90 లలో టాప్ హీరోయిన్ గా వెలిగిన తార శోభన, నటిగానే కాక. . .
రజనీకాంత్ సినిమాలో శోభన?
Updated on : Jan 20, 2012, 14:58 IST
| Views : 270

ఎన్నో ఆశలతో మొదలు పెట్టిన ‘రాణా’ సినిమా తన అనారోగ్యం కారణంగా చేయలేని పరిస్థతి ఏర్పడటంతో.....హీరో రజనీకాంత్ ఆ సినిమాను పక్కన పెట్టి కూతురు సౌందర్య దర్శకత్వంలో ‘కొచ్చాడయాన్’ అనే మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 
Recommended
Recommended
Latest News
Latest Albums