పుట్టినరోజు : May 16, 1954, మొదిటి సినిమా : నిన్నే పెళ్ళాడుత, రీసెంట్ రిలీజ్ : సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు,

సుద్దాల అశోక్ తేజ తెలుగు సినిమా కథ మరియు పాటల రచయిత. ఠాగూర్ (2003) చిత్రం లో ఆయన రచించిన నేను సైతం అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందాడు. ఆయన నల్గొండ జిల్లా సుద్దాల గ్రామంలో పుట్టాడు. ఆయన తండ్రి ప్రముఖ తెలుగు కవి సుద్దాల హనుమంతు మరియు తల్లి జానకమ్మ.

నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. సినీ నటుడు ఉత్తేజ్ కు మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. అయితే ఆలస్యమైంది. తనికేళ్ళ భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించారు. అయితే ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం దర్శకరత్న దాసరి నారాయణరావుని కలవడం. కృష్ణవంశీ లాంటి దర్శకుల సినిమాల్లో మంచి మంచి పాటలు రాశారు. తోలుత సుద్దాల హనుమంతు గారి కుమారుడు కావడం వల్లనో ఏమో... అన్ని విప్లవగీతాలే రాయాల్సి వచ్చింది. కృష్ణవంశి లాంటి దర్శకుల ప్రోద్బలంతో తన పాటల్లో అన్ని రసాలు ఒలికించారు.

2003 సంవత్సరానికి అశోక్ తేజకు "జాతీయ ఉత్తమ గీత రచయిత" అవార్డు లభించింది. ఇది తెలుగు సినీ గేయ రచయితలకు అందిన మూడవ అవార్డు. అంతకుముందు శ్రీశ్రీకి (అల్లూరి సీతారామరాజు సినిమాలో "తెలుగు వీర లేవరా" అనే పాటకు), వేటూరి సుందరరామమూర్తికి (మాతృదేవోభవ సినిమాలో "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" పాటకు) లభించాయి.

News about సుద్దాల అశోక్ తేజ
ఆర్.నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ జంట‌గా తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలోశ్రీమ‌తి చ‌ద‌ల‌వాడి ప‌ద్మావ‌తి నిర్మించిన చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌
రవీంద్రభారతిలో ఆకృతి, ఆల్‌ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో తొలి తెలుగు టాకీ దర్శక నిర్మాత హెచ్‌ఎం రెడ్డి స్మారక అవార్డును నిర్మాత దిల్‌రాజుకు అందజేశారు.
'సినీమహాల్' సాంగ్స్ రిలీజ్
Updated on : Nov 23, 2015, 12:52 IST
| Views : 453
కళానిలయ క్రియేషన్స్ పతాకంపై సిద్దాంస్, రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో తెరెక్కిన చిత్రం 'సినీ మహల్'. రోజులు నాలుగు ఆటలు అనేది ...
గాంధీ స్పూర్తితో దేశ ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చిన 'స్వచ్చ భారత్' కార్యక్రమంలో ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు, సినీ తారలు ...
సినిమా పాటలకి గాను పనిచేసిన రచయితలలో గొప్ప గొప్ప జీవిత పాఠాలను నేర్పే గేయ రచయితలు ఇప్పటి తరానికి ...
 
Recommended
Recommended
Latest News
Latest Albums